in

kalakarula goppa manasu yela untundho cheppina bapu garu!

త్తి రాజు లక్ష్మీనారాయణ అంటే ఎవరికి తెలియదు కానీ బాపు గారంటే తెలియని వారుండరు.కళాకారులు ఎంతటి సున్నిత మనస్కులో తెలియ చెప్పటానికి ఆయన జీవితం లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ గా చెప్పుకో వచ్చు. బాపు గారికి ఇళయరాజా అంటే మంచి అభిమానం, ఒక సారి ఇళయరాజా గారు ఒక గుడి నిర్మాణ సందర్భం లో గుడి గాలిగోపురానికి అయ్యే 35 లక్షల రూపాయలు తానే భరించి నిర్మింపచేసారు. ఆ గోపుర కలశ స్థాపన కు విచ్చేసిన ఒక మఠాధిపతి, మీరు హరిజనులట కదా? కలశ స్థాపన ఉత్సవం లో మీరు ఎలా పాల్గొంటారు? అని ఇళయరాజాను అవమానించారట, ఆ విషయం పత్రికలలో చూసిన బాపు గారు చాల బాధ పడ్డారట. పీఠాధిపతి అయి ఉండి మనుషుల్లో దేవుడిని చూడవలసింది పోయి, కుల వివక్ష చూపి అవమానిస్తారా అంటూ వాపోయారట. కొంతకాలం తరువాత అదే పీఠాధిపతి మీద ఒక పుస్తకం వ్రాసి కవర్ పేజీ బొమ్మ వేయమని బాపు గారి దగ్గరకు వచ్చారట నిర్వాహకులు, ఆ పీఠాధిపతిని నేను ఒక మనిషిగా కూడా గుర్తించనుఁ, అటువంటి వ్యక్తి బొమ్మ వేయటానికి నేను సిద్ధంగా లేను, దయచేసి నన్ను మన్నించండి అని తిరస్కరించి, సాటి కళాకారుడి మీద తనకు ఉన్న గౌరవాన్ని చాటిన, సున్నిత మనస్కుడైన ధీశాలి బాపు గారు.ఇంకితం లేని పీఠాధిపతి కన్నా కళాకారుడే గొప్పవాడు,మనిషిలో దేవుడిని చూడాలి, అనే విషయాన్నీ ప్రపంచానికి తెలియ చేసారు బాపు గారు.

sreemukhi about big boss nominations!

I stole mangoes in childhood: rashmika