
రానా-సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. విలక్షణమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం విడుదలై చేసిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి పోషించే పాత్ర నక్సలైట్ లేక రిపోర్టర్ కాదని ప్రజలను చైతన్య పరిచే ప్రజా గాయకురాలని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విప్లవ నాయకుడు క్యారెక్టర్‌లో కనిపించే రానా పట్ల ఆకర్షితురాలైన ప్రజా గాయకురాలిగా సాయి పల్లవి పాత్ర ఉండనుందని సమాచారం.

