in

rashmi clarifies about her relationship with sudheer!

జబర్దస్త్ సుధీర్‌, యాంకర్ రష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య ప్రేమ, దోమ లాంటి సంబంధాలేవీ లేవని రష్మి చెప్పుకొస్తున్నారు. ఆమె ఎంత చెబుతున్నా వాళ్లిద్దరిపై మాత్రం డేటింగ్ జరుగుతోందనే ప్రచారానికి తెరపడలేదు. ప్రస్తుతానికి వస్తే…లాక్‌డౌన్ కారణంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న రష్మితో ఓ వెబ్‌సైట్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు.సహజంగా మరోసారి సుధీర్‌తో ఎఫైర్ విషయమై ప్రశ్నించారు.

మీరంతా అనుకుంటున్నట్లు సుధీర్, నేను బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదని మరో షాక్ ఇచ్చింది రష్మి. కేవలం స్నేహితుడు మాత్రమే.. షూటింగ్ అయిపోయిన తర్వాత హాయ్, బై చెప్పుకునే స్నేహితుడు మాత్రమే అని షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ ఇద్దరి మధ్య ఉన్న ఈ డీసెంట్ ఫ్రెండ్ షిప్‌కు కూడా ఏదేదో పేర్లు పెట్టడం మంచిది కాదని చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. తమ మధ్య ఏం లేదని.. ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాగే చేస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పింది ఈ జబర్దస్త్ యాంకర్. మరి ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాతైనా రష్మి, సుధీర్ మధ్య గాసిప్స్ ఆగుతాయేమో చూడాలి.

sai pallavi is not a naxalite!

TOP 6 BIGGEST TRENDS IN INDIA!