మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు దాదాపుగా ఏదో ఒక సందర్భం లో ఎదో ఒక చిత్రం లో పాట పాడి ఉంటారు. రెండు వందల చిత్రాలకు పైగా మ్యూజిక్ డైరెక్షన్ చేసిన మణిశర్మ గారు, ఒక్కటంటే ఒక్క పాట కూడా పాడలేదు, కొంత ఆయన గాత్రసౌలభ్యం కారణం అయితే ఇంకొంత ఆయనకు ఎదురైన అనుభవాలు కారణం అని చెప్పవచ్చు. మణిశర్మ గారు కీరవాణి గారి వద్ద కీబోర్డ్ ప్లేయర్ గ ఉన్నపుడు ఒక మూవీ సాంగ్ రికార్డింగ్ సందర్భం లో కీరవాణి గారు పట్టుబట్టి, ఒక పాట పాడించారట ఆ తరువాత ఆ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. మణిశర్మ గారికి మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం వచ్చింది, కొన్ని ట్యూన్స్ అయన హమ్మింగ్ తో రికార్డు చేసి ఇచ్చిన తరువాత, అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత మళ్లీ కనిపించలేదట, ఆ తరువాత అశ్వని దత్తు గారు చిరంజీవి గారి తో తీసిన, చూడాలని ఉంది మ్యూజిక్ డైరెక్టర్ గ అయన ఫస్ట్ మూవీ అందులో హోరు గాలి వీస్తున్న సౌండ్ ను అయన నోటితో చేసి రికార్డు చేశారట ఒక పాట కోసం. అది కాస్త ఎడిటింగ్ లో ఎగిరిపోయింది. ఇన్ని అనుభవాల తరువాత తాను ఎప్పుడు పాడకూడదు అని నిర్ణయించుకున్నారట. అందువలనే మనకు వారి గొంతు వినె అవకాశమే రాలేదు.