in

nayanthara on her affairs!

నయనతార కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. నయనతార కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రేమలో పడింది. అప్పట్లో కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమలో పడిన నయన శింబును పెళ్లి చేసుకుంటుందన్న వార్తల వరకు వెళ్లింది. వీరిద్దరు కలిసి చేసిన వల్లభ సినిమాలో లిప్‌లాక్‌లు అప్పట్లో హైలెట్‌. ఆ తర్వాత ఆమె డ్యాన్స్ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పలు సినిమా వేడుకల్లో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రమలతకు కూడా విడాకులు ఇచ్చాడు.

శ్రీరామరాజ్యం తర్వాత తాను కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పింది కూడా. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా విడిపోయి నేను రౌడీనే సినిమా షూటింగ్ టైంలో ఆ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. విఘ్నేష్ నయన్ కంటే చిన్నవాడు కూడా. వీరిద్దరు ప్రేమ పెళ్లి వరకు వెళతారు అనుకుంటోన్న టైంలో ఇప్పుడు వీరిద్దరు విడిపోయారన్న వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ వార్తలు జోరుగా వస్తున్నా వీరిద్దరు మాత్రం స్పందించడం లేదు. దీంతో నయనతార ఈ సారి నిజంగానే బ్రేకప్ చెప్పేసిందన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై వీరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గాని ఈ పుకార్లకు చెక్ పడే పరిస్థితి లేదు.

ACHARYA COMPLETES HIS TASK!

HOW VENKATESH MISSED AISHWARYA RAI!