యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్ అయినా కూడా ఆ సినిమాకు ఎప్పటికి చెరిగి పోని రికార్డు ఉంది. అదే ఆడియో రిలీస్ విడుదల కార్యక్రమం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రావాలా’ సినిమా ఆడియో వేడుక 2003 డిసెంబర్ 5TH రోజున ఎన్టీఆర్ స్వస్థలం అయిన నిమ్మకూరులో జరిగింది. ‘ఆంధ్రావాలా’ సినిమాకు ముందు ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు పూరి కూడా మంచి మంచి సక్సెస్‌లు దక్కించుకుని ఉన్నాడు. దాంతో ‘ఆంధ్రావాలా’ ఆడియోకు అనూహ్య స్పందన వచ్చింది. నిమ్మకూరుకు అన్ని తెలుగు జిల్లాల నుండి ప్రత్యేక రైల్లు వేయించడంతో అభిమానులు దాదాపుగా 5 నుండి 6 లక్షల మంది వచ్చారు. తెలుగు సినిమా ఆడియో రిలీస్ ఫంక్షన్ కు ఇంత భారీ మొత్తంలో జనం తరలి రావడం ఇదే తొలిసారి..లోకల్ మీడియానే కాకుండా జాతీయ మీడియా కూడా ఈ ఈవెంట్ ను కవర్ చేయడానికి వచ్చారు. దింతో నిమ్మకూరు గ్రామం పేరు అంతటా మారుమోగిపోయింది..
లెక్క లేనంత మంది పోలీసులు ఇంకా ప్రైవేట్ సిబ్బంది ఈ కార్యక్రమం కు సెక్యూరిటీ గ ఉన్న కూడా..ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. నిమ్మకూరు నుండి దాదాపు 15 కిలోమీటర్ల వరకు రోడ్లు అన్ని మొత్తం వాహనాలతో జామ్ అయ్యింది.. ఇంతటి జనసమూహం మధ్య బై రోడ్ ఫంక్షన్ కు రాలేనన్న విషయాన్నీ గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో ఆరోజు సాయంత్రం సమయాన ఈవెంట్ కు చేరుకున్నారు.. తారక్ రాకతో జనం ఇంకా ఎక్కువగా రావొచ్చని సమాచారం అందడంతో ఈ ఈవెంట్ ను కేవలం అరగంటలో ముగించేశారు.. మీడియా వాళ్ళు కూడా జనం మధ్య ఇరుక్కుపోవడంతో వాళ్ళు కూడా ఈవెంట్ ను కవర్ చేయలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ ఎలా జరిగి ఉంటుందో..ఇది జరిగి 17 ఇయర్స్ అవుతున్న ఇలాంటి సినిమా ఆడియో ఫంక్షన్ మళ్ళి టాలీవుడ్ లో ఇంకా జరగలేదు.