కరోనా వర్మ అంటూ గత రాత్రి ఎన్టీవీలో వర్మతో డిస్కషన్ పెట్టారు యాంకర్ రుషి. ప్రస్తుతం ఛాలెంజ్ ట్రెండ్ నడుస్తోంది కదా.. మీరు ఎవరికైనా ఛాలెంజ్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు అని యాంకర్ అడిగాడు. దీనికి వర్మ నేను ఎవరి మాట వినను ఎవరికీ నా మాట వినమని చెప్పను. అలాంటప్పుడు నేను ఛాలెంజ్ విసరడం కాని పని అని చెప్పేశారు. ప్రస్తుతం మీరు పవన్ కళ్యాణ్‌కి ఒక ఛాలెంజ్ ఇవ్వాలి అనుకుంటే ఎం ఇస్తారు అని యాంకర్ అడగ్గా. దీంతో వర్మ.. పవన్ కళ్యాణ్ ఎందుకులే కాని ఈ లాక్ డౌన్ పిరియడ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రెస్ మీట్‌లో అందరి ముందు కూర్చుని ఒక గ్లాస్ విస్కీ తాగమని నా ఛాలెంజ్.. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ఆల్కహాల్ లేకుండా చచ్చిపోతున్నారు.
వాళ్లందరూ ఈయన పెగ్ వేస్తుంటే కుళ్లుకుని చచ్చిపోయేలా కేసీఆర్ వీస్కీ తాగాలని ఛాలెంజ్ చేశారు వర్మ. ఇక వర్మ ఛాలెంజ్‌కి ఖంగుతిన్న ఆ యాంకర్.. ‘నేను మిమ్మల్ని ఛాలెంజ్ అడిగి పెద్ద రిస్క్ చేసినట్టు ఉన్నాను అంటూ చేసిన తప్పును తరువాత తెలుసుకున్నారు. మందు షాపులు ఓపెన్ చేయాలని మీ ఉద్దేశమా అని తిరిగి ఆ యాంకర్ అడగ్గా.. ఓపెన్ చేయమని అడుగుతున్న వాళ్లకి కనిపించేలా కేసీఆర్ మందు కొడితే వాళ్లకి కేసీఆర్ పెద్ద విలన్‌గా కనిపిస్తారు ఆ బాధలో కరోనాను మర్చిపోతారనే ఉద్దేశంతో నేను ఈ కామెంట్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ.