కరోనా ప్రభావం ఎన్ని చర్యలు చేపట్టిన కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఈ క్రమంలో మద్యం దొరక్క ఓ సీనియర్ నటి కుమారుడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. దీంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే తమిళంతోపాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించిన సీనియర్ నటి మనోరమ కుమారుడు నిద్రమాత్రలు మింగినట్టు తెలిసింది.
అతడిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యానికి అలవాటు పడిన వారిలోచాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్‌తో వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఏకంగా ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొందరు మద్యం దొరక్క ఇతరత్రా మెడికల్ షాపుల్లో దొరికిన వాటిని కొనుక్కొని తాగుతున్నారు మందుబాబులు. ఈ క్రమంలో ఇటీవల కేరళ ప్రభుత్వం మద్యానికి బానిసలైన వారికోసం ఓ ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం విక్రయించే ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే, దీన్ని కోర్టు కొట్టివేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏకంగా మద్యం హోం డెలివరీ అనే ప్రతిపాదన తెచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ కూడా ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. కొంత సమయం పాటు మద్యం దుకాణాలను తెరవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో నటి కుమారుడు మద్యం దొరక్క ఇలా నిద్రమాత్రలు మింగడం కలకలం రేపింది.