in

THULASI GARI STHANAMLO AHUTHI PRASAD!

కృష్ణ వంశి గారి డైరెక్షన్ లో వచ్చిన విజయవంతమయిన సినిమా చందమామ, ఆ మూవీ లో హీరో శివబాలాజీ ఫాదర్ క్యారెక్టర్ లో ఆహుతి ప్రసాద్ గారి నటన అద్భుతం, ఆయనకు చాల మంచి పేరు తెచ్చిన క్యారెక్టర్. కానీ మొదట కృష్ణ వంశి గారు ఆ క్యారెక్టర్ కు తులసి గారిని అనుకున్నారట, ఒక గయ్యాళి పాత్ర గ దాని మలిచారట, ఆ క్యారెక్టర్ కోసం తులసి గారిని 35 రోజులు కాల్షీట్ అడిగారట, ఆ టైం లో తులసి గారు కన్నడ లో బిజీ గ ఉండటం వలన అన్నిరోజులు కాల్షీట్ ఇవ్వలేక ఆ క్యారెక్టర్ వదులుకున్నారట. చేస్తే ఆ క్యారెక్టర్ తులసి గారే చేయాలి అనుకున్న డైరెక్టర్ గారు, ఆ తరువాత ఆ క్యారెక్టర్ ని హీరో ఫాదర్ గ చేంజ్ చేసి ఆహుతి ప్రసాద్ గారితో చేయించారు. ఆ పాత్ర తులసి గారే చేసి ఉంటె ఇంకో విధంగా ఉండేదేమో, అయినా కూడా కృష్ణ వంశి గారు తులసి గారంటే ఉండే గౌరవం తో ఆవిడ గారి ఫోటో ను ఆ చిత్రంలో వాడుకోవటం జరిగింది, ఎలా అంటే ఈ లోకం లో లేని హీరో తల్లి గ ఆవిడ ఫోటో వాడుకోవటం జరిగింది. ఒక విధంగా తులసి గారు కృష్ణ వంశి గారి సినిమాలలో రెగ్యులర్ గ కనిపించే వారు, కానీ చందమామ లో ఫోటో రూపం లో ఆ లోటును తీర్చారు.

twists is amala’s second marriage!

ALLU ARJUN INTO A NEW BUSINESS?