[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఎ[/qodef_dropcaps] న్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన త్రివిక్రమ్ తన భార్యతో కలిసి ఎప్పుడు బయటకు రాడు. దీనితో త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు చాలామందికి తెలియవు. త్రివిక్రమ్ భార్య సౌజన్య క్లాసికల్ డాన్సర్ అన్న విషయం కూడ చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లో జరిగిన ఆమె నృత్య ప్రదర్శనకు త్రివిక్రమ్ వచ్చిన తరువాత కాని సౌజన్య త్రివిక్రమ్ భార్య అన్న విషయం మీడియా వర్గాలకు కూడ తెలియదు. సాంప్రదాయ పద్ధతిలో పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్న త్రివిక్రమ్ పెళ్ళి చూపుల నిమిత్తం సౌజన్య అక్కను చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు త్రివిక్రమ్ కు సౌజన్య అక్క కన్నా చెల్లెలు సౌజన్య నచ్చిందట.
ఈ విషయం సౌజన్య తల్లి తండ్రులకు తెలిసి త్రివిక్రమ్ కు పిల్లను ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పటికే ఆ ఇంటి పెద్దమ్మాయిని పెళ్ళి చేసుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి రంగంలోకి దిగి త్రివిక్రమ్ కు సౌజన్యను ఇచ్చి పెళ్ళి చేసేందుకు చాల కష్టపడి ఒప్పించాడట. అయితే సౌజన్య అక్క పెళ్ళి జరిగే వరకు త్రివిక్రమ్ ఆగవలసి రావడంతో తాను కోరుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి త్రివిక్రమ్ రెండేళ్ళు ఆగవలసి వచ్చిందట.
ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. మాటల మాంత్రికుడుగా పేరుపొంది ఎన్నో సినిమాలకు సంభాషణలు వ్రాసి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ సినిమాలను కూడ సౌజన్య పెద్దగా చూడదట. సినిమాల పట్ల ఏమాత్రం అభిరుచి లేని సౌజన్యకు తన క్లాసికల్ డాన్స్ తన పిల్లలు మాత్రమే తన ప్రపంచం అంటూ త్రివిక్రమ్ ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో జోక్ కూడ చేసాడు. చాలామంది ప్రముఖ దర్శకులు రచయితలు లా ఒక హాలిడే రిసార్ట్ లో కూర్చుని డైలాగ్స్ వ్రాయడం త్రివిక్రమ్ కు చేతకాని పని. ఇంటిలో కూర్చుని తన భార్య తన పిల్లలు చేసే సందడి మధ్య మాత్రమే తాను సినిమా డైలాగ్స్ వ్రాయగలను అంటూ త్రివిక్రమ్ చెప్పిన మాటలను బట్టి అతడు కుటుంబ వాతావరణాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అర్ధం అవుతుంది..