[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps] డల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సౌత్ లో క్రేజీ స్టార్ గ పేరు సంపాదించింది మళయాళీ ఆంటీ షకీలా, తన జీవిత చరిత్ర ఆధారంగా ‘షకీలా’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగ ఈ మూవీ ప్రొమోషన్స్ కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షకీలా టాలీవుడ్ హీరోస్ గురించి కొన్ని ఆసక్తిగల కామెంట్స్ చేయడం విశేషం.
యాంకర్ టాలీవుడ్ హీరోస్ మహేష్, ఎన్టీఆర్ ఇంకా అల్లు అర్జున్ గురించి అడుగగా దానికి
షకీలా గారు ఇల సమాధానం ఇచ్చారు.. ‘మహేష్ బాబు గారు నాకు బ్రదర్ లాంటి వారు, ఎన్టీఆర్ గారి డాన్స్ అంటే నాకు చాల ఇష్టం అతను మంచి డాన్సర్, అల్లు అర్జున్ పేరు ఎప్పుడు వినలేదు ఆయన ఎవరో నాకు తెలీదు’ అని చెప్పారు షకీలా. బన్నీ గురించి షకీలా అన్నా మాటలు నిజంగా అందరిని షాక్ కు గురిచేశాయి.. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ ఉందో మోలీవుడ్ లో కూడా అంతే క్రేజ్ ఉందన్న విషయం అందరికి తెలిసిందే.. కానీ, షకీలా అల్లు అర్జున్ ఎవరో నాకు తెలీదు.. అని ఎందుకు అన్నారో అన్నా విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది, ఇదిలా ఉంటే షకీలా బన్నీ గురించి ఇల చెప్పడాన్ని బన్నీ ఫాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు..