
యెన్.టి.ఆర్.నెలకు 500 వందల రూపాయల జీతం తో విజయ సంస్థ లో హీరో గ నటించే రోజుల్లో, తనకు ఉదయం పూట రెండు ఇడ్లి ఎక్కువ పెట్టమని నాగి రెడ్డి గారి రెకమండషన్ కోరారట. ఎందుకు, ఏమిటి ?. పాతాళ భైరవి సినిమా షూటింగ్ సందర్భం లో యెన్.టి.ఆర్. గారు ఉదయాన్నే స్టూడియో చేరుకొని అక్కడే, కర్ర సాములు, కత్తి యుధ్ధాలు ప్రాక్టీస్ చేసి బాగా ఆకలి మీద స్టూడియో లో ఉన్న క్యాంటిన్ కు వెళితే అక్కడ వారు, ఫిక్స్డ్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టె వారట, పాపం! యెన్.టి.ఆర్. గారి కి వారు పెట్టె టిఫిన్ సరిపోయేది కాదు, ఇంకా కాస్త పెట్టమని వాళ్ళను అడగటానికి అభిమానం అడ్డొచ్చిన యెన్.టి.ఆర్. గారు నేరుగా నాగి రెడ్డి గారి వద్దకు వెళ్లి, తాను చేస్తున్న కర్ర, కత్తి యుధ్ధాలకు వారు పెట్టె టిఫిన్ సరిపోవటం లేదనగానే, నాగి రెడ్డి గారు స్వయంగా క్యాంటీన్ కు వచ్చి ఇతను మన హీరో అయ్యా,ఇతను ఏమి అడిగిన పెట్టండి, నో రెస్టిక్షన్ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లి పోయారట.

