[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సౌ[/qodef_dropcaps] త్ లో అన్ని భాషల్లో కలిపి చేసింది చాల తక్కువ సినిమాలు అయినా పాపులారిటీ మాత్రం చాల ఎక్కువ సంపాదించింది ‘రౌడీ బేబీ’ సాయి పల్లవి. భారత దేశంలో 30 ఏళ్ల వయసు లోపు ఉన్న వ్యక్తిలో ఏడాదికి ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు ? అనే 30 మందితో కూడిన ఒక జాబితాను విడుదల చేసింది ప్రముఖ మ్యాగజైన్ సంస్థ ‘ఫోర్బ్స్’. ఈ జాబితాలో దేశంలో ఉన్న చాల మంది ప్రముఖులు ఇంకా బిజినెస్ పర్సన్స్ పేర్లు ఉన్నాయ్.
ఇంక అసలు విషయం లోకి వెళ్తే, ఈ జాబితాలో సాయి పల్లవి పేరు కూడా ఉండడం విశేషం.. తను ఏడాదికి దాదాపు 30 కోట్లు వరకు సంపాదిస్తుంది అంటూ ఫోర్బ్స్ మ్యాగజిన్ లో రావడం ఇప్పుడు అందరిని షాక్ కు గురిచేస్తుంది, అంతే కాకుండా పల్లవి కి 15వ స్థానం దక్కింది. కనీసం పట్టుమని పది సినిమాలు కూడా చేయని సాయి పల్లవి ఏడాదికి ఇంత భారీమొత్తంలో యెలా సంపాదిస్తుంది అంటూ అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్స్ గ పేరు తెచ్చుకొని బాలీవుడ్ లోను సత్త చాటుతున్న పూజ హెడ్గే, రకుల్ ప్రీత్ వంటి వారు కూడా కనీసం ఏడాదికి 15 కోట్లు సంపాదించడం లేదు.. అలాంటిది సాయి పల్లవి 30 కోట్లు ఎలా సంపాదిస్తుంది అనే ప్రశ్నకు ఇంక ఫోర్బ్స్ మ్యాగజైన్ సంస్థ పెద్దలే సమాధానం చెప్పాలి.