ఎప్పుడు నవ్వుతు కూల్ గ కనిపించే డైరెక్టర్స్ లొ ఒకరు మన సుకుమార్ గారు, ఆయన బైటికి ఎంత ఫన్నీ గ కనిపిస్తారో లోపల మాత్రం అంత ఎమోషనల్ అండ్ ఈజీ గ కోపం వచ్చేసి వ్యక్తి అంట. నిజమండి బాబు నమ్మరా? అయితే ఈ స్టోరీ మొత్తం చదవండి మీకే అర్ధం అవుతుంది. ఆర్య సినిమా తరువాత ‘జగడం’ కూడా బన్నీ తోనే చేయాలనీ అనుకున్నారట సుకుమార్. సినిమా స్టోరీ ఇంకా హీరో అంతా రెడీ చేసుకొని దిల్ రాజు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా సరే చేద్దాం అని ముందు చెప్పారట.
కొన్ని రోజులు తరువాత సినిమా విషయం గురించి రాజు గారితో మాట్లాడితే ఆయన యేవో కథలు చెప్పారంట, దాంతో విసుగెత్తిపోయిన సుకుమార్ గారు అదే రోజు రాత్రి హీరో రామ్ కి జగడం స్టోరీ ని చెప్పి తనని ఓకే చేసారు. ఆ వెంటనే ఆదిత్య బాబు గారు కూడా జగడం సినిమాను తాను నిర్మిస్తాను అని చెప్పడంతో సుకుమార్ గారు బన్నీ ఇంకా రాజు గారికి సమాచారం ఏమి ఇవ్వకుండా మరుసటి రోజున రామ్ తో జగడం మూవీ స్టార్ట్ చేసేసారు. విషయం తెలుసుకున్న దిల్ రాజు గారు సుకుమార్ గారిని ‘ఏంటి ఇలా చేసావ్’ అని అడిగారు, దానికి సమాధానంగా సుకుమార్ గారు సింగల్ లైన్ లొ ‘మీరు నాకు ఏదేదో కథలు చెప్తూ వచ్చారు, మీ మాటలు నాకు నచ్చలేదు, అందుకే కోపం తో జగడం ని మీకు చెప్పకుండా స్టార్ట్ చేశాను’ అని చెప్పారట సుకుమార్. అయితే ఇదంతా జరిగిన తరువాత సినిమా ఇండస్ట్రీ లొ ఇల ఎమోషనల్ గ ఉంటె కష్టం అని భావించి సుకుమార్ గారు అప్పటి నుండి కూల్ గ ఆలోచించడం స్టార్ట్ చేశారట..