in

balagam beauty kavya hits a mega jockpot!

లగం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన కావ్య హీరోయిన్ గా మారాక డీసెంట్ సినిమాలే చేస్తోంది. హారర్ థ్రిల్లర్ మాసూద తో మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత బలగంతో బిజీ హీరోయిన్ గా మారింది ఈ భామ. ఇక ఆఫర్లు మంచిగానే వస్తోన్నా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కావ్య కళ్యాణ్ రామ్ ఒక మెగా ఆఫర్ పట్టినట్లు సమాచారం.

హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాతో రోహిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం కోసం సంబరాల ఏటి గట్టు అనే వినూత్న టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది. ఈ నెలలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్తుందని సమాచారం..!!

f cube ‘shankar’!

viral : Tripti Dimri of Animal fame purchases rs14 crore house