in

20 years for indra!

2001 సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవికి కొంత బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. అన్నయ్య సూపర్ హిట్ తర్వాత మృగరాజు ఘోరంగా దెబ్బేసింది. శ్రీమంజునాథలో శివుడి వేషంతో నాగార్జునకు అన్నమయ్య తెచ్చినంత పేరు ఇస్తుందని ఆశిస్తే అదీ కోరుకున్న ఫలితం తేలేకపోయింది. ఇక డాడీ సంగతి సరేసరి. తమ అభిమాన హీరో నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవడం, ఏమి చేయలేక జైల్లో కూర్చుకోవడం ఫ్యాన్స్ దాకా ఎందుకు సాధారణ ప్రేక్షకులకే నచ్చలేదు. దెబ్బకు మరో ఫ్లాప్. హ్యాట్రిక్ తో చిరు మళ్ళీ వెనక్కు వెళ్లేలా ఉన్నారు.

దీంతో అభిమానులు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారని అల్లు అరవింద్ ని నిలదీసే దాకా వెళ్ళింది పరిస్థితి. అప్పుడాయన సముదాయించి ఇంకొక్క ఏడాది ఆగమన్నారు. వాళ్ళు నమ్మారు. ఆ నమ్మకం నూటికి వెయ్యి శాతం నిజమయ్యింది. నిర్మాత ఆయన కాకపోయినా బి గోపాల్ దర్శకత్వంలో అశ్వినిదత్ ఆవిష్కరించబోతున్న అద్భుతం గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. నిర్మాణంలో ఉన్నప్పుడు రషెస్ చూసి లిఖించబోయే చరిత్రను ముందే పసిగట్టారు. అదే ఇంద్ర..రజనీకాంత్ కు నరసింహ లాంటి ఎవర్ గ్రీన్ స్టోరీ ఇచ్చిన చిన్నికృష్ణ కథకు పరుచూరి బ్రదర్స్ సంభాషణలతో వైజయంతి బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఇంద్ర ఇవాళ 20 వసంతాలు పూర్తి చేసుకుంది..

మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా, తలవంచుకుని వెళ్తున్నా లేదంటే తలలు తీసుకెళ్లేవాడిని, నేనున్నాను నాయనమ్మా లాంటి సంభాషణలు అసలైన గూస్ బంప్స్ కు అర్థాన్ని చెప్పాయి. ముఖ్యంగా దాయి దాయి దామ్మా పాటలో లారెన్స్ తో చిరుతో వేయించిన వీణ స్టెప్పుకి థియేటర్ పైకప్పులు ఎగిరిపోయేలా అభిమానులు అల్లరి చేయడం అప్పటి వాళ్లకు గుర్తే. కర్నూలు జిల్లా ఆదోని లాంటి చిన్న సెంటర్లో కేవలం 30 రూపాయల టికెట్ రేట్ తో 247 రోజులకు గాను 52 లక్షలు పైగా వసూలు చేయడం బి సెంటర్స్ లో ఇప్పటికీ రికార్డే..నంది అవార్డుతో సత్కరించింది. 32 కేంద్రాల్లో 175 రోజులు ఆడటం ఒక హిస్టరీ. 10 కోట్ల బడ్జెట్ తో రూపొంది 40 కోట్ల వసూలు చేసిన ఇంద్రను తిరిగి 2006లో మహేష్ బాబు పోకిరి క్రాస్ చేసే దాకా ఆ రికార్డులు భద్రంగా ఉన్నాయి.

Disha Patani requested Director For icon star’s Scene!

Angry Nayanthara Fans Slams Karan Johar after ‘Disrespecting’ Her!