in

2 pan india movie releases in 3 days for meenakshi chowdhary!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది మీనాక్షి చౌద‌రి. తెలుగులో ఐదు సినిమాలు చేస్తోంది. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన ల‌క్కీ భాస్క‌ర్ మూవీ రిలీజ్ డేట్‌ ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కాగా మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన మ‌రో పాన్ ఇండియ‌న్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ( గోట్‌) ల‌క్కీ భాస్క‌ర్ కంటే రెండు రోజుల ముందు రిలీజ్ కానుంది..

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న గోట్ మూవీని సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ స‌న్న‌హాలు చేస్తోన్నారు. ఒక్క రోజు గ్యాప్‌లో మీనాక్షి చౌద‌రి రెండు పాన్ ఇండియ‌న్ సినిమాలు రిలీజ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ల‌క్కీ భాస్క‌ర్‌తో పాటు తెలుగులో మీనాక్షి చౌద‌రి ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర‌లో ఓ కీల‌క పాత్ర చేస్తోంది. త్రిష హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రితో పాటు మ‌రో హీరోయిన్ ఆషికా రంగ‌నాథ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తోంది.

kalki director nag ashwin accepts his mistakes!

rashmika mandanna onboard for chiranjeevi’s Vishwambhara?