సర్దార్ పాపారాయుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏకధాటిగా 16 గంటలు ఏమి ఆహరం తీసుకోకుండా, కేవలం మంచి నీరు తాగి నటించిన యెన్.టి.ఆర్. సర్దార్ పాపారాయుడు పాటల చిత్రీకరణ ఊటీ లో జరుగుతుండగా, డాన్స్ మాస్టర్ సలీం స్పాట్ లో కనిపించలేదు, మాస్టర్ ఎక్కడ అని అడిగిన యెన్,టి,ఆర్. కి సలీం మాస్టర్ స్పాట్ కి దూరం గ అడివి కోడి వండించుకొని తింటున్నారు అన్న విషయం చెప్పారు. సలీం కి ఒక ఝలక్ ఇవ్వాలి అనుకున్న యెన్.టి.ఆర్. మరుసటి రోజు ఉదయం సలీం మాస్టర్ టిఫిన్ కారియర్ ని తన కుర్చీ కింద పెట్టించారు. ఆకలి వేసిన సలీం మాస్టర్ ఆ కారియర్ విప్పబోయే సరికి, రండి బ్రదర్ టిఫిన్ చేద్దాం అని దాసరిని పిలిచి, అప్పటికే టిఫిన్ చేసి ఉన్న యెన్.టి.ఆర్. దాసరి , అందులో ఉన్న 48 బ్రేడ్ స్లైసులు, 24 అంలెట్లు ఇద్దరు తినేశారు..
చేసేదేమి లేక టీ తాగిన సలీం, జర్దా పాన్ వేసుకుంటుండగా ఏమిటి మాస్టర్ అది అనగానే, చేతిలోని కిమామ్ డబ్బా యెన్.టి.ఆర్. కి ఇచ్చారు సలీం. ఒక తమలపాకు తీసుకొని డబ్బాలో కిమామ్ మొత్తం వేసుకొని నోట్లో పెట్టుకున్నారు యెన్,టి,ఆర్. అందరు నోర్లు తెరుచుకొని అలాగే చూస్తుండి పోయారు. కిమామ్ దెబ్బకు కొంత మత్తుగా ఫీల్ అయిన యెన్.టి.ఆర్. కుర్చీలో అలాగే నిద్రలోకి జారుకున్నారు. మేలుకొన్న తరువాత షూటింగ్ చేసారు. మరుసటి రోజు కిమామ్ దెబ్బకి యెన్.టి.ఆర్. కడుపులో తుఫాన్ మొదలు అయింది, అయిన షూటింగ్ కి బ్రేక్ ఇవ్వలేదు యెన్.టి.ఆర్. 16 గంటలు ఆహరం తీసుకోకుండా ఏకధాటిగా నటించేసారు, మాస్టర్ మీకు పనిషమెంట్ ఇద్దామనుకుంటే, అది మాకు పనిషమెంట్ అయ్యింది అని స్పోర్టివ్ గ నవ్వేశారట యెన్.టి.ఆర్.