in

Yami Gautam is Suffering From an Incurable Skin Condition!

సినిమా వాళ్లంటే వాళ్ల లైఫ్ స్టైల్ చాలా పోష్ గా ఉంటుందని.. ఎలాంటి కష్టాలు లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారని అందరూ అనుకుంటారు. కానీ వాళ్లు కూడా తమ జీవితాల్లో ఎన్నో ఛాలెంజెస్ ను ఫేస్ చేస్తుంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. దీపికా పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్లు సైతం డిప్రెషన్ తో బాధపడ్డారు. మరికొందరు హీరోయిన్లు వింత వింత జబ్బులతో బాధపడుతున్నారు. తాజాగా యామీ గౌతమ్ కూడా తనకున్న అరుదైన వ్యాధి గురించి బయటకు చెప్పింది.

‘కెరటోసిస్ పిలారిస్’ అనే అరుదైన చర్మ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా యామీ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎడిట్ చేయని.. ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని.. దాచడానికి ఎంతో ప్రయత్నించా కానీ అందరూ అనుకునేంత భయంకరమైన వ్యాధి కాదని చెప్పుకొచ్చింది. చాలాసార్లు ఈ వ్యాధి గురించి బయటకు చెప్పడానికి ఎందుకు ఇబ్బందిపడుతున్నావని.. నన్ను నేనే అడిగేదాన్ని.. అందుకే ఇప్పుడు ధైర్యంగా అందరికీ చెబుతున్నా అంటూ రాసుకొచ్చింది.

bubbly beauty Raashi khanna Reveals Her Favorites!

telugu actress ramya pasupuleti latest photoshoot!