in

Will Lip locks Save neha shetty In her Third Attempt?

నేహాశెట్టి…‘మోహబూబా, గల్లీరౌడీ’ చిత్రాల్లో మెరిసిన కన్నడ కస్తూరి. తెలుగునాట కన్నడ భామల హోరు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేహా కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే కన్నడ భామలే కావటంతో వారి బాటలో తను కూడా స్టార్ కావాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. తాజాగా కృతి శెట్టి కూడా హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగునాట పాగా వేసిన నేపథ్యంలో నేహా నటించిన ‘డిజె టిల్లు’ త్వరలో విడుదల కాబోతోంది.

ఈ సినిమాతో ఎలాగైనా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది నేహా శెట్టి. అందుకు లిప్ లాక్స్ కి సైతం వెనుకాడటంలేదు. నిజానికి ఈ గ్లామరస్ హాటీ ‘మెహబూబా’ తోనే తనదైన ముద్రవేయటానికి ప్రయత్నించింది. ఆ సినిమా డిజాస్టర్‌ కావటంతో అమ్మడి యత్నం నెరవేరలేదు. ఆ సినిమాలో సైతం ముద్దులకు హద్దు పెట్టుకోకుండా ఎక్స్ పోజింగ్ కి సై అంది. ఆ తరువాత కొంత మంది యువ హీరోలతో జోడీ కట్టే అవకాశం వచ్చినా ఎందుకో నిరాకరించింది. ఆ తర్వాత సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’లో మెరిసింది.

అయినా తన టార్గెట్ ను రీచ్ కాలేక పోయింది..ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ తో కలసి ‘డీజే టిల్లు’తో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సైతం ఒంపుసొంపులను ప్రదర్శించటమే కాదు లిప్ లాక్స్ తో రెచ్చిపోయి గ్లామర్ గేట్స్ ను ఎత్తేసింది. ఎలాగైనా ఈ సినిమాతో టాలీవుడ్ లో పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉంది నేహాశెట్టి. ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న నేహా తన మూడో ప్రయత్నంలోనైనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుందో? లేదో? చూద్దాం.

romantic beauty ketika sharma sizzling stills!

new release dates announced, fans still have no hopes!