in

‘Will kill Salman Khan on April 30’, caller issues death threat!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను నెలాఖరులోగా.. అంటే ఏప్రిల్ 30వ తేదీలోపు చంపేస్తామంటూ ఫోన్ లో బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏప్రిల్ 10వ తేదీ ఈ మేరకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. తనను తాను రాఖీభాయ్ గా పరిచయం చేసుకున్నాడని..రాజస్థాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు కూడా చెప్పటం విశేషం. వాళ్లకీ వీళ్లకీ కాకుండా ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి మరీ.. సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం.. చంపి తీరతాం అని చెప్పటం సంచలనంగా మారింది.

పోలీస్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన కాల్ పై విచారణ చేస్తున్నారు ముంబై పోలీసులు. ఇందులో నిజం ఉందా లేదా..ఏదైనా ప్రాంక్ కాల్ చేశాడు.. కాల్ చేసిన వ్యక్తి వివరాలను ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్ పోలీసులను సైతం అలర్ట్ చేశారు ముంబై పోలీసులు. కొన్నాళ్ల క్రితం సల్మాన్ ఖాన్ కు ఈ–మెయిల్ ద్వారా వార్నింగ్ వచ్చింది. ఆ క్రమంలోనే కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలు చేశాడు బాలీవుడ్ హీరో. దీనికితోడు సెక్యూరిటీ పెంచారు ముంబై పోలీసులు. ఎక్కడికి వెళ్లేదే.. ఏ రోజు ఏ షూటింగ్ లో పాల్గొనేది అనేది ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి వెళుతున్నారు సల్లూభాయ్..!!

ismart beauty nidhi agarwal has 3 more in her kitty!

Niharika konidela deletes her husband’s photos and unfollows him!