in

Why telugu media is so focused on Jhanvi Kapoor?

జాన్వీ కపూర్ అంటేనే కేరాఫ్ హాట్ అడ్రస్.. సినిమాల్లో ఏమోగానీ అమ్మడి గ్లామర్ షో సోషల్ మీడియాను హీటెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు బికినీతో బోల్డ్‌ ఫోటో షూట్ చేస్తునే ఉంటుంది. ఇక జిమ్‌లో అయితే హద్దే ఉండదు. ఎద అందాలు, పొట్టి నిక్కర్లతో థైస్ చూపిస్తూ కుర్రకారును తెగ టెంప్ట్ చేస్తుంటుంది. అందుకే సినిమాల్లో అమ్మడి అందానికి పెద్దగా గుర్తింపు లేదు. పోని గొప్ప ఫర్ఫార్మా అంటే.. అది కూడా లేదు. అది కాకుండా స్టార్ హీరోయిన్ స్టార్‌డమ్ ఉందా.. అంటే అది లేదు. వెబ్ సిరీస్, మీడియం రేంజ్ హీరోల సరసన రొమాన్స్ చేస్తు.. వెకేషన్లతో కాలం వెళ్లదిస్తోంది. ఈ హాట్ బ్యూటికి ఉన్నదల్లా ఒక్కటే బ్రాండ్.. అతిలోక సుందరి శ్రీదేవి తనయ అనే ముద్ర ఉండడమే. అది తప్పితే అమ్మడి గురించి గొప్పగా చెప్పాల్సిందేమి లేదు. అసలు ఇప్పటి వరకు తెలుగు నుంచి ఒక్క ఆఫర్ కూడా ఆమె దగ్గరికి వెళ్లలేదు.

కానీ సౌత్ మీడియాలో ఆమె గురించి గొప్పలు చెబుతున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కోసం ట్రై చేస్తున్నారని.. కానీ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని రాస్తున్నారు. అసలు ఈ పుకార్లు ఎలా వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఎన్టీర్ 30 కోసం కొరటాల, జాన్వీ కపూర్‌ని ఫిక్స్ చేశాడనే న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. అంతేకాదు 5 కోట్లు డిమాండ్ చేస్తే.. 4 కోట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. అసలు యంగ్ టైగర్‌తో జాన్వీకి ఛాన్స్ రావడమే గొప్ప..అలాంటిది ఏ స్టార్ హీరోయిన్‌కి లేని పారితోషికం ఇచ్చి మరీ తీసుకొస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఎన్టీఆర్‌తో ఏ హీరోయిన్ నటించినా.. సినిమాలో ఉందా, లేదా అన్నట్టే ఉంటుంది. మరి జాన్వీని ఎందుకు లేపుతున్నారనేది.. మన తెలుగు మీడియాకే తెలియాలి..!!

Rasshi Khanna beats srk to top IMDb’s Popular Indian Celebrities!

MAN PROPOSES,GOD DISPOSES!