పెళ్లి సందడి’ ఈ ఒకే ఒక్క సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన శ్రీ లీల ఇప్పుడు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇటీవల రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది. శ్రీ లీల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందమైన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో శ్రీ లీల నీలిరంగు చీరలో కుందనపు బొమ్మలా తయారయ్యింది.
సంక్రాంతి సందర్భంగా శ్రీ లీల షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు వీడియోలకి నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ లీల అందానికి ముద్దులయ్యమంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, మహాలక్ష్మిలా ఉందంటూ మరికొందరు కామెంట్ చేశారు. అయితే ఈ వీడియోకి ఒక నెటిజన్ చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. సాంప్రదాయం ఉట్టిపడేలా నీలిరంగు చీరలో తన అందంతో ఆకట్టుకున్న శ్రీ లీల వీడియో చూసి ఒక నేటిజన్ “నువ్వు ఇలా నీ అందం తో అందరిని అల్లాడిస్తుంటే.. మేం చస్తే మా చావుకు బాధ్యత నీదే”..అంటూ ఫన్నీ గా శ్రీ లీల అందాన్ని పొగుడుతూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!