ఓడలు, బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి, అలాగే నేటి బాల నటులు, హీరోలు అవుతారు, కానీ కొంత మందే హీరోలు అయి నిలదొక్కుకుంటారు, మరి కొంత మందేమో ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో కూడా తెలియకుండా మాయమయిపోతారు. మనము ఎంతో మంది బాల నటి, నటులను చూసి ఉంటామో అందులో కొందరే కమల్ హాసన్, శ్రీ దేవి అవుతారు, ఎక్కువ మంది మాత్రం తెర మరుగు అయిపోతారు, కారణాలు ఇవి అని చెప్పలేము. యెన్.టి.ఆర్., జమున నటించిన ఏ.వి.ఏం.వారి “రాము” చిత్రంలో బాల నటుడిగా నటించిన రాజ్ కుమార్ ని చాల మంది చూసే ఉంటారు, “పచ్చని చెట్టు ఒకటి , వెచ్చని చిలకలు రెండు ” అనే పాట చూసి ఉంటె అతను తప్పకుండా గుర్తుకు వస్తాడు. తమిళ్ వెర్షన్ రాము చిత్రం లో రాజ్ కుమార్ నటనకు నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. ఆలా తమిళ, కన్నడ, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో దాదాపుగా 50 చిత్రాలలో నటించాడు రాజ్ కుమార్.
రాజ్ కుమార్ తండ్రి కూడా కన్నడ నటుడు, ఆయన పేరు హనుమంతచారి. ఆయన మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా. వయసు పెరిగే కొలది, వచ్చే శారీరక మార్పుల వలన బాల నటుడిగా సూట్ అవ్వవు అంటూ, అవకాశాలు రావటం తగ్గాయి, వయసు పెరిగాక, పొట్టిగా ఉన్నవని, మరికొంత మంది పొడుగుగా ఉన్నావు అని అవకాశాలు ఇవ్వకుండా దాట వేశారు. తండ్రి వద్ద సరదాగా నేర్చుకున్న సంగీతం అక్కరకు వచ్చింది, అకార్డినిన్, కాంబో వాయిద్యాలు వాయించటం లో మంచి నైపుణ్యం ఉన్న రాజ్ కుమార్ చాల మంది సంగీత దర్శకుల వద్ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గ మంచి పేరు తెచ్చుకున్నారు. నటనకు స్వస్తి చెప్పి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ గ సెటిల్ అయ్యారు రాజ్ కుమార్. రాని అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఒకప్పటి భోగాన్ని తలచుకొని కుమిలిపోతూ, జీవితాన్ని పాడు చేసుకోకుండా, తన నైపుణ్యాన్ని నమ్ముకొని జీవితాన్ని ముందుకు సాగించటం ఎంతో గొప్ప విషయం, లెట్ అస్ విష్ హిం అల్ ది బెస్ట్..!!