హ్యాపీ డేస్ “అప్పు” గుర్తుందా? ఆమె అసలు పేరు గాయత్రీ రావు, ఆమె తల్లి బిగ్ స్క్రీన్ అండ్ స్మాల్ స్క్రీన్ మీద మంచి పేరున్న నటి, బెంగళూరు పద్మ, ఆమె తండ్రి క్యారెక్టర్ యాక్టర్ అరుణ్ కుమార్, బాబాయ్ కన్నడ ఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్, మేనత్త కన్నడ లో పేరున్న హీరోయిన్ ఆమె పేరు సుధా రాణి, ఈమె తెలుగులో రాజేంద్ర ప్రసాద్ కి జోడిగా “మాస్టారి కాపురం” చిత్రంలో నటించారు. కుటుంబం అంత నటులే, సహజంగానే గాయత్రీ కూడా సిల్వర్ స్క్రీన్ మీద తన ఫ్యూచర్ చూసుకోవాలి అనుకుంది. హ్యాపీ డేస్ ఆమె కు గుడ్ స్టార్ట్ అనే చెప్ప వచ్చు, కానీ ఆమెకు మాత్రం కెరీర్ లో హ్యాపీ డేస్ రాలేదు. ఆరెంజ్, గంగ పుత్రులు, గబ్బర్ సింగ్ వంటి సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
గబ్బర్ సింగ్ చిత్రంలో ఆమె నటించిన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చిన, అవకాశాలు మాత్రం రాలేదు. కన్నడ నటుడు దేవరాజ్ కుమారుడికి జోడిగా ” ఏక్ పోలీస్” చిత్రంలో హీరోయిన్ గ నటించింది,ఆ చిత్రం సూపర్ హిట్ అయింది, అయినా అక్కడ కూడా అదే అపరిస్థితి. ఆమెను కారణం అడిగితే , నేను తెలుగు అమ్మాయిని కదా అందుకే నాకు అవకాశాలు రావటం లేదు అంటూ వాపోయింది. అది ఒక విధంగా నిజమే, టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలే కరువైపోయిన ఈ రోజుల్లో అవకాశాలు రావటం కష్టమే. టెంపరరీ గ సినిమాలకు గుడ్ బై చెప్పిన అప్పు 2019 , నవంబర్ 21 పెళ్లి పీటలు ఎక్కింది, గృహిణిగా సెటిల్ అయింది.