in

Vishnu Manchu’s daughters turn singers for his next!

డామంచు మోహన్ బాబు గారి మనవరాళ్లు…. విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ‘గాలి నాగేశ్వరరావు’ సినిమా ద్వారా గాయనీమణులుగా పరిచయం అవుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను వాళ్ళిద్దరూ పాడటం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ‘గాలి నాగేస్వరరావు’లో అరియానా, వివియానా పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది. సినిమాలోని కీలక సందర్భంలో ఆ పాట వస్తుంది” అని చిత్ర బృందం పేర్కొంది..

‘గాలి నాగేశ్వరరావు’లో ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సాంగ్ సినిమాకు మరో హైలైట్ కానుంది. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా… కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Mahesh Babu sensational comments on Father’s Biopic!

Actress Indhuja latest stills in pink Saree!