in

villain role in akhanda is so special for me : srikanth

శ్రీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘ఇదే మా కథ’ రెడీ అవుతోంది. గురు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, భూమిక .. సుమంత్ అశ్విన్ .. తాన్య హోప్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బైక్ రైడింగ్ నేపథ్యంలో ఈ కథ సాగనుంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతున్నప్పుడు, ‘అఖండ’ సినిమాను గురించిన ప్రస్తావన వచ్చింది.

అప్పుడు ఆయన స్పందిస్తూ ..’అఖండ’ సినిమాలో విలన్ గా తెరపై నేను ఎలా కనిపిస్తాననేది ఎవరూ ఊహించలేరు. నా పాత్ర వేషధారణ .. ఆ పాత్ర స్వభావం అలా ఉంటాయి. ఎన్నో గెటప్స్ గీయించి చివరికి బోయపాటిగారు ఒకటి ఫిక్స్ చేశారు. ఆ సినిమాలో నేను చాలా భయంకరంగా .. క్రూరంగా కనిపిస్తాను. ఆ సినిమా చూస్తూ ఆడియన్స్ నన్ను తిట్టుకోవడం ఖాయం. అంత దుర్మార్గంగా ఆ పాత్ర ఉంటుంది. నాకు మాత్రం చాలా వైవిధ్యభరితమైన పాత్రలో చేశాననే సంతృప్తి కలిగింది. తప్పకుండా ఈ పాత్ర నా కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చారు.

tejaswi madivada at amf donation presentation!

Rashmika , Vicky Kaushal brutally trolled for new underwear ad!