in

VIJAY SHANTHI NOT INTERESTED TO ACT WITH CHIRU AGAIN!

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి వీరి కాంబోలో సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్లకు క్యూ కట్టేవారు. అంతలా ప్రేక్షుకుల మదిని గెలుచుకున్నారు ఈ ఇద్దరు. వీరిద్దరూ 18 సినిమాలు నటించడగా.. అందులో పలు సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి..అయితే చాలా కాలం తర్వాత మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ` సరిలేరు నీకెవ్వరు` సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విజయశాంతి మాట్లాడుతూ.. సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని భావించినప్పటికి రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల కుదరడం లేదని ఆమె తెలిపారు. అలాగే భవిష్యత్తులో చిరంజీవితో నటించే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. అసలు ఆయనతో నటించే ఇంట్రస్టే లేదని తేల్చేశారు. చిరునే కాదు.. మరే స్టార్ హీరో సినిమాలో కూడా నటించే ఆసక్తి లేదని తెలిపింది..

YOUNG TIGER JR NTR ON GOT THRONE TELUGUSWAG EDITS

big boss beauty Divi vadthya Hits A Jackpot!