in

vijay devarakonda replaces mahesh babu for ‘thumbs up’!

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమాతో కూడా మరో హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో లైగర్ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పూరీ, ఛార్మి, కరణ్ జోహార్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్న ఓ పాపులర్ యాడ్ లో కనిపించబోతున్నాడు.

అవును…గత కొన్నేళ్లుగా మహేష్ థమ్స్ అప్ యాడ్ లో నటిస్తున్నాడు. కొత్త యాడ్ లో కూడా బాలీవుడ్ హీరో రణ్‌వీర్, సింగ్ మహేష్ బాబుపై చిత్రీకరించారు. ఇది టీవీల్లో కూడా ప్రసారమవుతోంది..అయితే తాజాగా ఈ ప్రకటనలో మహేష్ బాబు బదులుగా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ యాడ్ విజయ్ చేతికి వచ్చింది. కాగా దీనికోసం విజయ్ ఏకంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ పేరునే మార్చుకున్నాడు. విజయ్ దేవరకొండ తుఫాన్ గా ట్విట్టర్ లో పేరు చేంజ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇది ట్రెండింగ్ లో ఉంది.

‘Khiladi’​​ Movie Teaser, Ravi Teja, Meenakshi Chaudhary!

Teja Reddy Saree Stills from ‘Mela’ Movie on Location!