ముకుంద’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని న్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ కెరీర్లో 10వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్స్‌పై అల్లు వెంకటేశ్, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ రోజు వరుణ్ తేజ్ బర్త్‌డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ లుక్ మూవీపై ఆసక్తిని కలిగిస్తుంది. గని అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్ ప్రత్యేకంగా అమెరికాలో శిక్షణ పొందారు.