in

varshini and mangli says no to big boss!

బిగ్ బాస్.. అదో పూన‌కం అంతే. ఏమీ లేన‌ట్టే క‌నిపిస్తుంది గానీ, అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేస్తుంటుంది. రేటింగుల‌న్నీ ఆ షోవే. అందుకే.. ప్ర‌తీ సీజ‌న్ హిట్ట‌వుతూ వ‌స్తోంది. త్వ‌ర‌లోనే బిగ్ బాస్ 5 మొద‌ల‌వ్వ‌బోతోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. బిగ్ బాస్ లిస్టు ఇదే.. అంటూ ఓ జాబితా కూడా చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌తీ జాబితాలోనూ ఉన్న కామ‌న్ పేర్ల‌లో.. `మంగ్లీ` ఒక‌టి. త‌న ఆట పాట‌ల‌తో హుషారెత్తిస్తుంటుంది మంగ్లీ. తెలంగాణ ప‌ల్లె సంప్ర‌దాయాల‌కు సంబంధించిన పాట‌ల్ని పాడ‌డంలో మంగ్లీ స్పెష‌లిస్టు.

త‌న ప్ర‌తీ పాటా హిట్టే. అందుకే వెండి తెర‌పైనా సంద‌డి చేస్తోంది. ఈమ‌ధ్య కొన్ని సినిమా పాట‌లు కూడా పాడింది. మంగ్లీ బిగ్ బాస్ హోస్‌లో ఉంటే, ఈ షోకి కొత్త ఆక‌ర్ష‌ణ వ‌స్తుంద‌ని నిర్వాహ‌కులు భావించారు. అందుకే భారీ పారితోషికం ఇచ్చి, మంగ్లీని లైన్ లోకి తీసుకొచ్చారు. అయితే చివ‌రి క్ష‌ణాల్లో మంగ్లీ.. ఈ షో నుంచి త‌ప్పుకుంద‌ని తెలుస్తోంది. త‌న వ్య‌క్తిగ‌త ప‌నులు, రికార్డింగుల కార‌ణంతోనే బిగ్ బాస్ కి నో చెప్పింద‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. మ‌రో యాంక‌ర్ వ‌ర్షిణి కూడా బిగ్ బాస్ కి నో చెప్పింద‌ని స‌మాచారం. అలా.. ఇద్ద‌రు ముద్దుగుమ్మలు ఈ షోకి డుమ్మా కొట్టిన‌ట్టైంది.

Faria Abdullah at Makeup Studio & Academy launch!

goa beauty ileana likely to reunite with Ravi Teja!