FACT 01:
వరలక్ష్మి నటుడు శరత్‌కుమార్ మరియు చాయా దంపతులకు మార్చి 5, 1985 న జన్మించారు. * వరలక్ష్మికి నలుగురు తోబుట్టువులు.. ఇందులో వరలక్ష్మి పెద్దది.. ఈమెకి ఒక చెల్లెలు ఒక తమ్ముడు రాహుల్ ఉన్నారు. వీరితో పాటుగా ఆమె సవతి తల్లి రాధికకి ఓ కూతురు ఉన్నారు. ఆమె వరలక్ష్మికి సోదరి అవుతుంది ఆమె రాయన్నే హార్డీ.
FACT 02:
నటి కావడానికి ముందే వరలక్ష్మి ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ నుండి డిగ్రీ పొందారు.
FACT 03:
2014లో మానిక్య చిత్రంతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి. 2016 లో కసబా చిత్రంతో మమ్ముట్టి సరసన నటించి మలయాళంలోకి అరంగేట్రం చేసింది. ఇక సుందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ సినిమాతో 2019లో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
FACT 04:
వరలక్ష్మి చెన్నైలోని హిందుస్తాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి మైక్రోబయాలజీలో మరియు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా పొందారు.
FACT 05:
వరలక్ష్మి గారు మహా జంతు ప్రేమికురాలు కూడా..అంతే కాకుండా 2017 లో ‘సేవ్ శక్తి’ అనే కాంపెయిన్ ను కూడా స్టార్ట్ చేసారు, ఇది మహిళా హక్కుల కోసం పని చేస్తుంది.