నాటక రంగ అనుభవం లేనిదే, సినీ ప్రవేశం చేయటం వీలు లేని రోజులు అవి, నాటకాలు గేట్ వే అఫ్ సినిమా అన్న మాట. సినిమా వేషాల కోసం ప్రయత్నించే వారు మద్రాస్ “ఆంధ్ర క్లబ్” లో నాటకం ఆడవలసిందే, సినీ రంగ ప్రముఖులు చాల మంది ఆ నాటకాలను చూసి వారికి కావలసిన పాత్రలకు సరి పోయే నటులను ఎన్నుకొనే వారు. అదే తరహాలో పాపులర్ నాటకాలు, ” బాల నాగమ్మ”, “కన్యా శుల్కం” ” చింతామణి” సినిమా రూపం దాల్చాయి. గోదావరి జిల్లాలో పాపులర్ అయిన నాటకం “చిల్లరకొట్టు చిట్టెమ్మ” , వాణిశ్రీ చిట్టెమ్మ గ ఆంధ్ర క్లబ్ లో నాటకం ప్రదర్శించారు, అందులో వాణిశ్రీ నటన నచ్చిన కన్నడ దర్శకుడు హంసురి కృష్ణ మూర్తి, తాను తీస్తున్న” వీర సంకల్ప” అనే కన్నడ చిత్రం లో హీరొయిన్ గ అవకాశం ఇచ్చారు. ఆ తరువాత 1965 లో “చిల్లర కొట్టు చిట్టెమ్మ” నాటకాన్ని సినిమా గ తీయాలనే ప్రయత్నం చేసారు, చిట్టెమ్మ పాత్రకు వాణిశ్రీ, దత్తుడు పాత్రకు కృష్ణం రాజు, జీళ్ళ సీతయ్య పాత్రకు ఎస్.వి.ఆర్., పువ్వుల పున్నయ్య పాత్రకు అల్లు రామలింగయ్య ను అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగా లేదు..
ఆ తరువాత 1977 లో మరో ప్రయత్నం జరిగింది, ఆ ప్రయత్నానికి దాసరి నారాయణ రావు గారు సహకారం అందించి, దర్శకత్వం వహించారు, ఆ నాటకం లో ఉన్న డబల్ మీనింగ్ డైలోగ్స్ కత్తిరించి, చిత్రాన్ని ఎంతో ఉదాత్తం గ మలచారు దాసరి. ఈ చిత్రంలో చిట్టెమ్మ పాత్ర జయచిత్ర, దత్తుడు పాత్ర మురళి మోహన్, జీళ్ళ సీతయ్య పాత్ర గోకిన రామ రావు, పువ్వుల పున్నయ్య పాత్ర నటుడు మాడ పోషించారు. చిత్రం సూపర్ హిట్ అయ్యింది ఆ చిత్రం లోని ట్రాన్స్ జెండర్, పువ్వుల పున్నయ్య పాత్ర పోషించిన మాడ, ఆ తరువాత అటువంటి పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ అయ్యారు. పువ్వుల పున్నయ్య మీద చిత్రీకరించిన “చూడు పిన్నమ్మ, పాడు పిల్లాడు” అనే పాటలో బాలు గాత్ర విన్యాసం, మాడ నటన చాతుర్యం మరపు రానిది. ఆ క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యింది అంటే, ట్రాన్స్ జెండర్ ని చూసి ఎవడ్రా వీడు మాడ లాగున్నాడు అనేంతగా. ఆలా వాణిశ్రీ తో మొదలయిన చిల్లర కొట్టు చిట్టెమ్మ పాత్ర, జయ చిత్రను వరించింది, ఆమె పేరును చిరస్థాయిగా నిలిచేట్టు చేసింది, జయ చిత్ర , చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకొనేందుకు ఉపయోగ పడింది..!!