in

VANISRI GARU SHOBHAN BABU GARIKI PETTINA NICK NAME YEMITI ?

శోభన్ బాబు గారిని, వాణిశ్రీ గారు సరదాగా ఒక నిక్ నేమ్ తో పిలిచి ఆట పట్టిస్తూ ఉండేవారట, అదేమిటో మీకు తెలుసా? శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న రోజుల నుంచి ఇద్దరు కలసి చాల చిత్రాలలో నటించారు, అంతే కాదు హీరో, హీరోయిన్ లు గ 28 చిత్రాలలో నటించారు.” మోస్ట్ లవబుల్ పెయిర్” గ మంచి పేరు ఉండేది వీరిద్దరికి. వారి మధ్య ఉన్న చనువు కొద్దీ, వాణిశ్రీ గారు సెట్ లోకి రాగానే గుడ్ మార్నింగ్ “యంగ్ లేడీ” అనే వారట శోభన్ బాబు గారు, యంగ్ లేడీ అనక పోతే, యంగ్ గర్ల్ అనవచ్చు కదా అనే వారట వాణిశ్రీ గారు, అబ్బా! ఎంత ఆశ ,పెళ్లి అయి ఉంటె ఇద్దరు బిడ్డల తల్లివి అయి ఉండేదానివి అనే వారట శోభన్ బాబు గారు, ఇంకా నయం డజన్ మంది పిల్లలు అన్నారు కాదు, అనేవారట వాణిశ్రీ.

వాణిశ్రీ గారు ఏమి తక్కువ తిన్నారా, అందులో నెల్లూరు వాళ్లకు కొంచెం” కిండల్” ఎక్కువే, సినిమాలకి వచ్చిన కొత్తలో ఆమె శోభన్ బాబు గారిని “బన్ బాబు” అని పిలిచేవారట, ఆ తరువాతి కాలం లో ఎప్పుడయిన శోభన్ బాబు గారిని ఉడికించాలంటే “బన్ బాబు”” బన్ బాబు” అని అందరు వినేట్లు పిలిచే వారట, ఆ దెబ్బ తో శోభన్ బాబు గారు చేతికి అందిన కర్రో, చిన్న రాయి గాని తీసుకొని ఆమెను తరిమే వారట. ఇదంతా చూస్తున్న వాణిశ్రీ గారి అమ్మ గారితో పెద్దమ్మ ఎలా కన్నావమ్మా ఈ గయ్యాళిని, సినిమాలో, బయట, ఎప్పుడు గొడవే అంటూ కంప్లైన్ట్ చేసే వారట శోభన్ బాబు గారు. ఎంతో సరదాగా ఉండే ఈ సినీ జంట ఎన్నో చిత్రాలలో నవల హీరో,హీరోయిన్లుగా చాలా గంభీరంగా నటించి తిరుగులేని జంటగా పేరు గడించారు.

cute Actress Hemal Ingle Stills in blue jeans!

Yesteryear heroine laila making her re-entry after 15 years!