
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘వాల్మీకి’. కోలీవుడ్ హీరో అధర్వ మురళి మరో హీరోగా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 20న(రేపు) విడుదల కాబోతున్న ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. ఈ చిత్రం విడుదల నిలిపివేయాలంటూ నోటీసులు అందడం చిత్ర యూనిట్ ను టెన్షన్ లోకి నెట్టేసింది.మొదటి నుండీ ఈ చిత్రం టైటిల్ విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘వాల్మీకి’ అనే టైటిల్ పెట్టడం పై బోయ కులానికి చెందిన ప్రజలు కేసులు పెట్టారు.
దీంతో చిత్ర యూనిట్ వాల్మీకి టైటిల్ ను “గద్దల గొండ గణేష్ ” అని మార్చారు….అదీ మాటర్ !!