బుల్లితెర యాంకర్లలో శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు స్పాంటినిటి.. స్పీడ్, యాస అన్ని తెలిసిన యాంకర్‌గా అమెకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫీమేల్ యాంకర్లలో టాప్-5లో శ్రీముఖి కూడా ఒకరు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకూ ఆమె గురించి ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చింది అంటారా? ఆ విషయానికే వస్తున్నాం..నిన్న ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14). ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ రోజు తాము ప్రేమిస్తున్న వారికి ప్రపోజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన రోజు మరింత స్పెషల్‌గా చేసుకునేందుకు.
ఇప్పటికే లవ్‌లో ఉన్నవారు మరింత స్పెషల్‌గా ఈ రోజును జరుపుకుంటారు. తాజాగా శ్రీ ముఖి కూడా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో తన ఫొటోను షేర్ చేస్తూ.. ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్’ అని ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లో హార్ట్ సింబల్స్, లవ్ సింబల్స్‌తో కూడిన స్మైలింగ్ ఫేస్ ఈమోజీలను జోడించింది శ్రీముఖి. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకుని ఉంది.
పోస్ట్‌లో ఉన్న లైన్స్‌ను, ఫోటోను చూస్తే.. శ్రీముఖి ప్రేమలో పడినట్లు తెలుస్తోందంటున్నారు నెటిజన్లు. ప్రేమికుల రోజు తనకు ప్రపోజ్ చేయగా.. తాను అంగీకరించినట్లు అర్థమవుతోందని చర్చించుకుంటున్నారు. తాను ఓకే చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? అనే విషయంపై మాత్రం శ్రీముఖి క్లారిటీ ఇవ్వలేదు. దీనితో సోషల్ మీడియాలో శ్రీ ముఖి బాయ్ ఫ్రెండ్ ఎవరా..? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి అతడెవరో తెలియాలంటే.. శ్రీముఖి నుంచి గానీ.. అవతలి వ్యక్తి నుంచి గానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Feb 14th 2022! 🧿❤️🥰
— SreeMukhi (@MukhiSree) February 14, 2022
Idhi gurthupettukondi! Malli matladkundam! ❤️🧿
Best Valentine’s ever! 🧿🧿🧿🧿
🥰🥰🥰🥰🥰🥰🥰🥰#bestvalentineever #irreplaceable #cloud9 #happiest #sreemukhi pic.twitter.com/Ty0DX7qKvl