ఈరోజుల్లో ఐటెమ్ భామలకున్న డిమాండ్ హీరోయిన్లకు సైతం లేదు. అందుకే సమంత లాంటి అగ్ర కథానాయికలు కూడా ఐటెమ్ గాళ్స్ గా మారిపోతున్నారు. ఐటెమ్ భామలకు కొరత లేకపోయినా.. ఎప్పటి కప్పుడు కొత్తందాల్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఐటెమ్స్ గాళ్స్‌ని దిగుమతి చేసేస్తున్నారు. తాజాగా ఊర్వశి రౌతాలా అనే కొత్త ఐటెమ్ భామ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రామ్ – బోయపాటి సినిమాలో ఊర్వశి ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేస్తోంది. ఇప్పుడు..చిరంజీవి `వాల్తేరు వీరయ్య`లోనూ తను ఐటెమ్ పాటకు స్టెప్పులేస్తోంది.
రామ్ – బోయపాటి శ్రీనుల సినిమాకి గానూ ఊర్వశికి రూ.30 లక్షల పారితోషికం చెల్లించార్ట. అదే మొత్తానికి..`వాల్తేరు వీరయ్య` ఐటెమ్ కీ ఊర్వశి ఒప్పుకొందని సమాచారం. ఆ లెక్కన… ఊర్వశి చీప్ గా దొరికేసినట్టే. నిజానికి ఊర్వశికి బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. టాలీవుడ్ లో ఐటెమ్ గీతాలు చేయడానికి ఇది వరకే తనకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ మంచి సినిమా, క్రేజీ కాంబినేషన్ కోసం ఇంత వరకూ ఆగింది రౌతాలా. ఇప్పుడు రామ్, చిరు సినిమాల్లో తనకు ఆఫర్లు వచ్చాయి. అందుకే…`నో` చెప్పలేకపోయింది. పైగా తక్కువ మొత్తానికే ఈ పాటల్లో నటించడానికి ముందుకొచ్చింది. ఈ రెండు గీతాల్లో ఒక్కటి పేలినా.. కనీసం ఓ అరడజను గీతాలు తన చేతికి వస్తాయని రౌతాలాకు బాగా తెలుసు. అందుకే..ఈ ఎత్తుగడ వేసింది..!!