in

Uppena Beauty kriti shetty’s romance Is A Hot Topic Now!

ప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిపడ్డ యంగ్ బ్యూటీ కృతిశెట్టి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమాలోనే రొమాన్స్‌కు ఏమాత్రం అడ్డు చెప్పకుండా నటించి అందరి దృష్ఠినీ ఆకట్టుకుంది. దాంతో ఈ యంగ్ బ్యూటీకి వరుసగా హీరోయిన్ అవకాశాలు వచ్చాయి. నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగ రాయ్ సినిమాతో పాటు, రామ్ హీరోగా రూపొందుతున్న సినిమా, నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు ..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అందుకుంది.

ఒకదాని తర్వాత ఒకటి షూటింగ్ పూర్తవుతూ వస్తున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కో విభిన్నమైన పాత్రలో నటిస్తోంది కృతిశెట్టి. అంతేకాదు ఆన్‌స్క్రీన్ రొమాన్స్, ఎక్స్‌ఫోజింగ్‌కు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అందుకు ఉదాహరణ తాజాగా రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా. ఈ సినిమాలో కృతికి నానితో చేసిన రొమాన్స్ పీక్స్ అని ఇటీవల వచ్చిన ట్రైలర్‌తో అర్థమైంది. ఇందులో కృతికి నాని లిప్ కిస్ పెట్టిన సీన్ చాలా హైలెట్ అయింది.

ఇప్పుడు ఇదే లిప్ కిస్‌ను జీఐఎఫ్ చేసి వదిలారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన పిక్స్ కూడా బాగా నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. దాంతో రెండవ సినిమా నుంచే కృతిశెట్టి రొమాన్స్‌లో, లిప్ లాక్స్ ఇవ్వడంలో రెచ్చిపోతుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి అందంతో పాటు పర్ఫార్మెన్స్ ఇలా రొమాంటిక్ సీన్స్‌కు, లిప్ కిస్సులకు నో చెప్పకపోతే గ్యారెంటీగా కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి కృతిశెట్టి ఇప్పుడున్న ఊపును ఎంతకాలం కొనసాగిస్తుందో..

Pawan Kalyan to power Trivikram wife’s classical dance program!

reshma pasupuleti sizzling photos in blue saree!