
ఉపాసన. పరిచయం ఏమాత్రం అవసరం లేని డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. హెల్త్, ఫిట్ నెస్ లో నెటిజన్లకు ఎన్నో సలహాలు..సూచనలు చేస్తుంటారు. అంతేకాదు సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుండే ఈ మెగా కోడలు చాలా చాలా వినూత్నమైన అంశాలపై చాలెంజ్ లు చేస్తుంటారు.అయితే తాజాగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..పెళ్లి అయిన తరువాత తాను చాలా అడ్జస్ట్ కావాల్సి వచ్చిందట..రామ్ చరణ్ వాళ్ళది సెలబ్రెటీ ఫ్యామిలీ కావడంతో మీడియా అటెన్షన్ చాలా ఎక్కువగా ఉండేదనీ..తన పై చాలా విమర్శలు కూడా వచ్చాయి అనీ..మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చింది ఉపాసన..ఆ తరువాత మెల్లగా అలవాటు చేసుకున్నాను అనీ…ఈ విషయంలో సానియా మీర్జా సలహాలు కూడా ఇచ్చింది అని వెల్లడించింది.

