in

Trivikram all praises on actress Samantha!

టి సమంతపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిగ్రా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ మాట్లాడుతూ..తమిళం, తెలుగు, మలయాళం..ఇలా అన్ని ఫిలిమ్ ఇండస్ట్రీల్లోనూ ఒకే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో రజనీకాంత్ తర్వాత సమంత మాత్రమేనని ప్రశంసించారు. ఇది ఆమెపై ఉన్న ప్రేమతో అంటున్న మాట కాదని త్రివిక్రమ్ అన్నారు.

ఏ మాయ చేసావే మూవీ నుంచే సమంత హీరో అని, ఆమెకు వేరే శక్తి అక్కర్లేదని, తానే ఓ శక్తి అని కితాబు ఇచ్చారు. సమంత ముంబయిలోనే ఉండకుండా అప్పుడప్పుడూ హైదరాబాద్‌కు రావాలని కోరారు. మీరు సినిమాలు చేయడం లేదని మేం కథలు రాయడం లేదని, మీరు నటిస్తానంటే మేం కథలు రాస్తామని అన్నారు. ‘అత్తారింటికి దారేది’ లాగా..సమంత కోసం ‘హైదరాబాద్‌కు రావడానికి దారేది’ అనాలేమో అంటూ కామెంట్స్ చేశారు. సమంత రావాలని ట్రోల్ చేయాలని త్రివిక్రమ్ అన్నారు..!!

Anushka Shetty is set to tie the knot with a Dubai businessman!

actress Priya Bhavani Shankar clarity on glamor roles!