in

Trisha returns to Telugu cinema with ‘Vishwambhara’!

పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అటు ఆ సినిమాలోను..ఆ సినిమా వేడుకలలోను త్రిష గ్లామర్ చూసి షాక్ కానివారంటూ లేరు. తెరపై ఆమె ముత్యంలా మెరిసింది.. ముద్దబంతిలా విరిసింది. అప్పటి నుంచి అంతా ఆమె గ్లామర్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. వివిధ భాషలలోని సీనియర్ స్టార్స్ సినిమాల నుంచి ఆమెను సంప్రదించడం మొదలైంది. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి..బాలకృష్ణ సినిమాల వైపు నుంచి త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిన్ననే ఆమె ‘విశ్వంభర’ సినిమా షూటింగులో జాయిన్ అయింది.  ‘స్టాలిన్’ తరువాత ఇంతకాలానికి ఆమె చిరూ జోడీగా ఛాన్స్ దక్కించుకోవడం నిజంగా విశేషమే. ఇక బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్స్ సరసన కూడా ఆమె మెరిసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి త్రిష తన గ్లామర్ తో మిగతా సీనియర్ భామలను కలవరపెడుతోందనే అనుకోవాలి..!!

samantha’s guest role in balayya – bobby film?

happening girl sreeleela reveals her beauty secrets!