in

Trisha mourns the passing away of her hardcore fan!

భిమానులకి ఏదైనా కష్టమొచ్చినా హీరో హీరోయిన్స్ కూడా అంతే స్థాయిలో స్పదించి ఆర్థిక సహాయం చేస్తుంటారు. ఒకప్పుడు ఫ్యాన్స్ తో సెలబ్రెటీలకు అంతగా రిలేషన్స్ ఉండేవి కాదు. కానీ సోషల్ మీడియా ట్రెండ్ వచ్చాకా.. ఎంతమంది అభిమానులతో అయినా స్టార్స్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నారు. ట్వీట్లు, కామెంట్ల రూపంలో అభిమానులు, తారలు ముచ్చట్లు పెట్టుకుంటారు కూడా. స్పెషల్ పేజీలు, అకౌంట్లతో ఏమి ఆశించకుండానే తమ తారలకు కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తుంటారు అభిమానులు.

ఇలా సీనియర్ హీరోయిన్ చెన్నై బ్యూటీ త్రిషకి కూడా కొందరు వీరాభిమానులు ఉన్నారు. అందులో ముఖ్యమైన వీరాభిమాని అయిన కిషోర్ నేడు మరణించాడు. త్రిష ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్‌ను ఈ స్థాయికి పట్టుకు రావడానికి చాలా కృషి చేశాడట. ఎంతో మంది త్రిష అభిమానులను ఒక్క చోటకు తీసుకొచ్చాడట. అలాంటి వ్యక్తి చనిపోవడంతో త్రిష అభిమానులు విషాదంలో మునిగిపోయారు. తన అభిమాని చనిపోయాడని తెలుసుకున్న త్రిష కూడా కన్నీరుమున్నీరైంది. తన గుండె బద్దలైందన్నట్టుగా చెప్పేసింది. నీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదర అంటూ ఎమోషనల్ అయింది.

Samantha turns item girl for Pushpa!

first pan indian hero N.T.R!