in

Top 10 heroes with best body and physique in Tollywood!

10. NAGARJUNA

60 ఏళ్లు దాటిన నాగార్జున తన బాడీ ఫిట్ నెస్ కోసం మరీ ఎక్కువ కష్టపడరట. రోజూ ఓ గంట పాటు జిమ్ చేస్తారు నాగ్. కనీసం 8 గంటలు నిద్రపోతారు. లైట్ ఫుడ్ తీసుకుంటారు. డైటింగ్ చేయరు కానీ..వారంలో ఆరు రోజులు ఎక్సర్‌సైజులు చేయాల్సిందేనట. నాగార్జునను టాలీవుడ్ మన్మథుడని ఎందుకంటారో ఇప్పడు అర్థమైందా!

09. MAHESH BABU

})(jQuery);

టీవల మహేష్ బాబు వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. మహేష్ స్విమ్ చేస్తున్న ఫోటోలు అతని భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్ చూసి ఫిదా అయిపోయారు.రోజు రోజుకు యంగ్‌‌‌గా కనిపిస్తున్న మహేష్…ప్రతి రోజు తప్పకుండా వ్యాయామం చేస్తుంటారు.

08. VIJAY DEVARAKONDA

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫిట్ నెస్ బాడీ కోసం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటారు. ఇటీవల రిలీజ్ అయిన లైగర్ సినిమాలో ఫైటర్ బాడీ షేప్ కోసం విజయ్ దాదాపు 2 ఏళ్లు శిక్షణ తీసుకున్నారట. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ పక్కన యాక్ట్ చేయాలని విజయ్ కూడా ఫైటర్ లుక్‌ కోసం చాలా కష్టపడ్డారట. ఈ రౌడీ బాడీ చూసి తెలుగు యూత్ మతిపోయిందనే చెప్పాలి.

07. AKHIL AKKINENI

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని వర్క్ అవుట్స్‌ విషయంలో అసలు తగ్గరట. ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ ఎక్కువ టైమ్ జిమ్‌లో కష్టమైన వర్క్ అవుట్స్ చేశారట. అఖిల్ ఎంతో కష్టపడి తన బాడీని బీస్ట్ లుక్‌లోకి మార్చేశారు..సిక్స్ ప్యాక్స్..బల్క బాడీ లో కనిపించి అందర్నీ షాక్ కు గురి చేసాడు మన సిసింద్రీ..నెక్స్ట్ సినిమాల్లో మరి ఇలానే ఉంటాడా…

06. ALLU ARJUN

ల్లు అర్జున్ మొదటి నుంచి బాడీ ఫిటినెస్‌పై ఫోకస్ పెట్టారు. ఒక్కో సినిమాలో ఒక్కోలా బన్ని కనిపిస్తుంటారు. పుష్ప సినిమాలో బాడీ లాంగ్వేజ్ పాన్ ఇండియా లెవల్‌లో ఫేమస్ అయింది. పుష్ప 2 సినిమా కోసం కండ‌ల తిరిగిన బాడీని రెండేళ్ల నుంచి మెయింటెన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రతి రోజూ ఉదయం దాదాపు 45 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై ర‌న్నింగ్ చేస్తారట.

05. JR NTR

సినిమాలు చేస్తున్న కొత్తలో ఎన్టీఆర్ ఫిట్ నెస్ విషయం అంత పట్టించుకునే వారు కాదు. ‘యమదొంగ’ సినిమా నుంచి తన బాడీ రూపురేఖలే మార్చేశారు. సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల విడుదలైన RRR సినిమాలో ఎన్టీఆర్ ఫిజిక్ ఓ రేంజ్‌లో ఉంది. వచ్చే సినిమాల్లో ఎన్టీఆర్ లుక్ ఇంకా సూపర్ ఉంటుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు.

04. RAM CHARAN

RRR తో పాన్ ఇండియా హీరోగా మారారు రామ్ చరణ్. పాన్ ఇండియా హీరో అంటే ఓ రేంజ్‌లో బాడీ ఫిటినెస్ ఉండాలి. రీసెంట్‌గా వర్క్ అవుట్ వీడియో చూస్తే ఫిట్ నెస్ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ప్రస్తుతం దర్శకుడు శంకర్ సినిమా కోసం చరణ్ తన బాడీ షేపింగ్‌పై ఫోకస్ పెంచారు. తన నెక్ట్స్ సినిమాలో మరింత ఎట్రాక్టీవ్ లుక్‌లో కన్పిస్తారట..

03. PRABHAS

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పర్సనాలిటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. హీరోయిజానికి తగ్గట్టుగా తన పర్సనాలిటీ మెయింటెన్ చేస్తారు డార్లింగ్. ప్రతి రోజూ కచ్చితంగా గంట పాటు ప్రభాస్ ఎక్సర్‌సైజ్ చేస్తారట. బాడీ ఫిట్‌గా ఉంచే స్క్వాట్స్, వాకింగ్ లంజెస్ వంటి ఎక్సర్‌సైజులు చేస్తుంటారు. ‘ఆదిపురుష్’, ‘సాలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాల్లో ఒక్కో లుక్‌లో కనిపించనున్నారట ప్రభాస్.

02. RANA

హీరోలలో రానా దగ్గుబాటి ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే హీరో పాత్రలలో పాటు విలన్ పాత్రల్లోనూ రానా నటించి మెప్పిస్తుంటారు. బాహుబలిలో రానా బాడీ ఫిట్ నెస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాల్లో లుక్ కోసం తన ఆహారం, తన వర్క్ అవుట్స్‌ను ప్లాన్ చేసుకుంటారు రానా. సినిమా కోసం కావలిసిన బల్క..లేదా స్లిమ్ లుక్ లో కనిపించి అలరిస్తాడు.

01. SUDHEER BABU

సుధీర్ బాబు బాడీ ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతుంటారు. కఠినమైన కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు తన బాడీని పర్ఫెక్ట్ షేప్‌లో పెడుతుంటారు. తన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. సిక్స్ ప్యాక్‌లో కనిపించే సుధీర్ చాలా మందికి రోల్ మోడల్ అట. ఫిట్ నెస్ సీక్రేట్స్ చెప్పమని పలువురు హీరోలు బాబును అడుగుతుంటారట. జిమ్ చేస్తుండటంతో పాటు కొత్త కొత్త ఎక్సర్‌సైజులు చేస్తుంటారు.