in

TOP 10 ACTORS IN POLICE ROLE!

10. వెంకటేష్

ఫ్యామిలీ హీరో గ పేరున్న విక్టరీ వెంకటేశ్ గారు కూడా ‘సూర్య ఐపీఎస్’, ‘సూపర్ పోలీస్’ ‘ఘర్షణ’ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించినా..బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది..ఫలితాల మాట అటుంచితే..ఘర్షణ సినిమాలో వెంకీ మామ పాత్ర అదుర్స్ అనిపించింది, పోలీస్ అంటె ఇలానే ఉండాలి అనేలా చేసారు వెంకీ గారు.

09. నాగార్జున

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గారు కూడా ‘నిర్ణయం’, ‘రక్షణ’, ‘శివమణి’.రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఆఫీసర్’ మూవీలో పోలీస్ పాత్రల్లో నటించి నటుడిగా మిశ్రమ ఫలితాలను అందుకున్నాడు..శివమణి లో ఆయన చేసిన యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్ర  అతనికి మంచి పేరు తెచ్చింది.

08. బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఫ్యాక్షన్ సినిమాల్లోనే కాకుండా పోలీస్ పాత్రలో కూడా తనదైన ముద్ర వేశారు, ‘ఇన్‌స్పక్టర్ ప్రతాప్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ ‘చెన్న కేశవరెడ్డి’ వంటి చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా నటించి మెప్పించాడు.

07. చిరంజీవి

మెగా స్టార్ చిరంజీవి గారు కూడా ‘రక్త సింధూరం’, ‘జ్వాలా’, ‘ఎస్.పి.పరశురామ్’ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించారు. ఇక చిరు పోలీస్ పాత్రలో నటించినా కూడా ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఒంటి చేత్తో ఎన్నో సినిమాలని హిట్ చేసిన చిరు పోలీస్ పాత్రలో మాత్రం పెద్దగా మెప్పించ లేకపోయారు అనే చెప్పాలి.

06. జూనియర్ ఎన్టీఆర్

పోలీస్ ఉద్యోగం చేసేవాళ్లకు కాస్త కోపం ఎక్కువే ఉంటుంది..కాని ఆ కోపం తో పాటు.. ఎప్పుడు చుట్టూ వైఫై ల టెంపర్ కూడా ఉంటె ఎలా ఉంటుందో మనకు చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. బాద్ షా, టెంపర్ లాంటి సూపర్ హిట్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు తారక రాముడు. మొత్తానికి పోలీస్ పాత్రలు ఎన్టీఆర్ కెరీర్ కు బాగా మేలు చేసాయని చెప్పాలి.

05. రవి తేజ

మాస్ ఆడియన్స్ ఎంతో ఇష్టపడే హీరో మన ‘మాస్ మహా రాజా రవి తేజ’ గారు, ఖాకి చొక్కా వేసుకొని తెర మీద రఫ్ ఆడించాడు ఈ హీరో. రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన ‘విక్రమార్కుడు’ సినిమా ఇందుకు నిదర్శనం. ఆ తరువాత పవర్ సినిమాతో కూడా తన పవర్ ఏంటో మళ్ళి చూపించాడు. మొత్తం మీద పోలీస్ పాత్ర  రవి తేజ గారికి బాగానే పేరు తెచ్చిందని చెప్పాలి.

04. మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని స్క్రీన్ మీద మాములుగా చుసిన కూడా ఫ్యాన్స్ మురిసిపోతారు, అలాంటిది మహేష్ ఇంక పోలీస్ గెటప్ వేస్తె ఫ్యాన్స్ కు పండగే. వృత్తికి పోలీస్ అయినా పోకిరి గ నటించడం, విలన్స్ మీద తన దూకుడును ప్రదర్శించడం, ఇలాంటివి మన మహేష్ గారికే సాధ్యం. పోకిరి, దూకుడు, వంటి సూపర్ హిట్ సినిమాలతో పోలీస్ పాత్రకు బాగా న్యాయం చేసారు మహేష్ బాబు.

03. పవన్ కళ్యాణ్

క పోలీస్ ఆఫీసర్ కి బాగా తిక్క అనేది ఉండి దానికి ఒక లెక్క లేకపోతె..ఎలా ఉంటుందో చూపించాడు మన గబ్బర్ సింగ్ కళ్యాణ్ బాబు గారు. గుడుంబా శంకర్, పులి, లాంటి ప్లాప్ సినిమాల్లో పోలీస్ పాత్ర  చేసిన పవన్ కళ్యాణ్ గారు..ఆ సినిమా రిజల్ట్స్ తో ఏమాత్రం సంబంధం లేకుండా గబ్బర్ సింగ్ లో నటించి తీరుగులేని విజయాన్ని అందుకున్నారు..

02. సాయి కుమార్

లాంటి పాత్రలైనా అలవోకగా చేసే యాక్టర్ మన సాయి కుమార్ గారు, తను పోలీస్ పాత్రలో చెప్పిన ఒక డైలాగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘కనిపించే మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికి ప్రతీకలైతే.. ఆ కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అంటూ సాయి కుమార్ గారు చెప్పిన ఈ డైలాగ్ ఎప్పటికి మరచిపోలేము. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గ ఆయన చేసిన సినిమాలు ‘పోలీస్ స్టోరీ’,’పోలీస్ స్టోరీ 2 ‘,’అగ్ని IPS ‘ మంచి విజయాన్ని సాధించాయి.

01. రాజశేఖర్

పోలీస్ ఆఫీసర్ పాత్రలంటే తెలుగు ఆడియన్స్ కు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు రాజశేఖర్. ‘అంకుశం’ సినిమాతో పోలీస్ అంటే ఇలాగే ఉండాలనే దానికి ఓ ఐకాన్‌గా మారాడు ఈ యాంగ్రీ హీరో. పోలీస్ గెటప్ లో రాజశేఖర్ గారికి వచ్చిన సక్సెస్ మన ఇండస్ట్రీ లో ఇంకా ఏ హీరోకు రాలేదనే చెప్పాలి.

NTR’S CHALLENGE FOR CHIRU AND BALAYYA!

RGV CHALLENGES C.M KCR!