in

tollywood queen anushka quitting films?

తెలుగు సినిమా కథానాయికల్లో అనుష్క శెట్టికి వున్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలతో సమానంగా క్రేజ్‌ను సంపాందించుకున్న అనుష్క ఇమేజ్‌ ‘బాహుబలి’తో మరింత పెరిగింది. ఆమె డేట్స్‌ కోసం స్టార్‌ హీరోలు ఎదురుచూస్తుంటారు. అయితే ‘బాహుబలి-2’ తర్వాత ఈ అందాలభామ సినిమాల ఎంపిక విషయంలో మరింత పర్టిక్యులర్‌గా వుంటుంది. బాహుబలి తర్వాత భాగమతి, నిశ్శబ్ధం చిత్రాల్లో మాత్రమే నటించింది.

‘సైరా’లో చిరంజీవిపై వున్న అభిమానంతో అతిథి పాత్రలో మెరిసింది. అయితే త్వరలోనే ఈ బెంగళూరు సోయగం సినిమాలకు గుడ్‌బై చెప్పనుందని సమాచారం. అందుకే కొత్త చిత్రాలేమీ అంగీకరించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇంతకుముందే అంగీకరించిన గౌతమ్‌మీనన్‌ చిత్రం కూడా క్యాన్సల్‌ అవ్వడంతో అనుష్క శెట్టి సినిమాలకు స్వస్తి పలికే ఆలోచనలో వున్నారని తెలిసింది.

no regular songs in pawan – krish movie!

naresh loni natudini gurthinchina Amitabh Bachchan!