2012లో సినిమా ఇండస్ట్రీలోకి నిర్మాత ఎంట్రీ ఇచ్చిన కృష్ణ ప్రసాద్.. మొదట సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఆ తర్వాత కబాలి సినిమా తెలుగు వెర్షన్ కు నిర్మాతగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ గతేడాది ఆయన డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. ఆయనతో చాలా మంది సెలబ్రిటీలకు లింకులు ఉన్నాయని అప్పట్లో తీవ్ర అలజడి రేగింది..
కృష్ణ ప్రసాద్ సినిమాల్లో నష్టాలు రావడంతో అప్పట్లో గోవాలో ఓహెచ్ ఎం పబ్ ను స్టార్ట్ చేశారు. కాగా గోవాలో తనకు నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో ఈ పబ్ నుంచే సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. పోలీసులు అరెస్ట్ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే హైదరాబాద్ లో చాలా మంది దగ్గర అప్పులు చేయడంతో..వాటిని తీర్చలేక మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది, చివరకు ఇలా సూసైడ్ చేసుకుని చనిపోయాడు..!!