సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు కైకాల. గతంలో ఒకసారి అపోలో హాస్పిటల్ లో చేరారు. అప్పుడే కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కొనాళ్ళు హాస్పిటల్ వుండి కోలుకొని ఇంటికి చేరుకున్నారు. తాజాగా ఆరోగ్యం మరోసారి ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. దాదాపు 60ఏళ్ల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో మెరిసిన కైకాల వైవిధ్యమైన నటనతో ‘నవరస నటనా సార్వభౌమ’ బిరుదును పొందారు. వయోధిక సమస్యలతో గత రెండేళ్లుగా సినిమాలకూ విరామమిచ్చారు. 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాల విషయానికి వస్తే 2019లో విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘మహర్షి’ చిత్రాల తర్వాత ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు. కైకాల మరణం పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు..!!