dasari blockbuster cinema nu vadulukunna shobhan babu!
సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకులకి సినిమా ఛాన్స్‌లు ఇవ్వాలంటే కొద్దిగా బయపడుతుంటారు స్టార్ హీరోలు.. ఇది ఇండస్ట్రీలో సహజమే కూడా.. సరిగ్గా మూవీ లెజెండ్ దాసరి విషయంలో కూడా జరిగిందట. దాసరి దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'తాతమనవడు' .. ఎస్వీ రంగారావు, రాజబాబు ప్రధానపాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. కె. రాఘవ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే ఈ సినిమాని ముందుగా అప్పటికీ స్టార్ హీరో అయిన శోభన్ బాబుతో చేయాలనీ అనుకున్నారట దాసరి. [...]