బికినీ భామ దిశా పటాని..‘సలార్’ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్. ప్రభాస్ సరసన ఈ భామ అయితే బాగుంటుంది అని భావించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఐతే, ఈ బాలీవుడ్ భామ ఇప్పటికిప్పుడు 60 రోజుల పాటు డేట్స్ ఇవ్వాలంటే కష్టం అని చెప్పింది. దాంతో ఆమెని పక్కన పెట్టారు. తన స్థానంలో చెన్నై బ్యూటీ ను తీసుకున్న సంగతి తెలిసిందే. సలార్ రెగ్యులర్ షూటింగ్ ఈమద్యే తెలంగాణ లోని సింగరేణి ప్రాంతంలో మొదలైంది..
త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్నది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి ప్లాన్. అందుకే గ్యాప్ ఇవ్వకుండా బల్క లో డేట్స్ ఇచ్చేదుకు శృతి హాసన్ ఓకే చెప్పడంతో పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చిమరీ తనను ఎంపిక చేసారు. వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమా చేసి టాలీవుడ్ లో గోరమైన ఎంట్రీ చేసిన దిశా పాటని ప్రభాస్ సినిమా తో ఇక్కడ రి ఎంట్రీ ఇద్దామనుకున్న డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాకు నో చెప్పక తప్పలేదు..