in

This is how Anushka Shetty escaped from casting couch!

నుష్క సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో ఉందని.. నేను కూడా అలాంటివి చూశానని.. ఇది కేవలం తెలుగులోనే కాదు. ప్రతి ఇండస్ట్రీలో ఉందని పేర్కోన్నారు. నాగార్జున హీరోగా 2005లో విడుదలైన సూపర్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 17ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు అనుష్క విమర్శలపాలైన దాఖలాలు లేవు. ఇక ఒక్కరిద్దరు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయనే రూమర్స్ తప్పితే పెద్దగా కాంట్రవర్సీల జోలికి కూడా దూరంగా ఉంటుంది అనుష్క. అలాంటి అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది..అనుష్క మాట్లాడుతూ ‘నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడతాను.

అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను.. కానీ నేను దురుసుగా ఉండటం వల్ల నా దగ్గర ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. బాహుబలి తర్వాత అనుష్క సినిమాలు తగ్గించారు. ఆఫర్లు వస్తున్నా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం. ఈ మూవీలో ఆమె మూగ అమ్మాయి రోల్ చేశారు. మాధవన్ కీలక రోల్ చేసిన ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది..

DJ tillu’s Girl In Demand, Hikes Her fees?

TOP 10 KANNADA BEAUTIES who made it big in TOLLYWOOD!